టాలీవుడ్ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె పాటలు పాడే విధానంతో పాటు మాట్లాడే విధానం కూడా అందరికీ నచ్చుతుంది. అందుకే సునీతకి అభిమానులు ఎక్కువగానే ఏర్పడ్డారు. అయితే రెండో పెళ్ళి విషయంలో ఈమె చాలా విమర్శలు ఎదుర్కొంది. పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉండగా.. అదేం పని అంటూ చాలా మంది ఈమెను వ్యక్తిగతంగా దూషించారు. అయితే సినీ ప్రముఖులు మాత్రం ఈమెకు అండగా నిలబడ్డారు.
ఆ తర్వాత సునీత రెండో పెళ్లి గురించి అందరూ మర్చిపోయారు అనే చెప్పాలి.ఆ తర్వాత సునీత బుల్లితెరపై కూడా పలు షోలకు జడ్జిగా, మెంటర్ గా వ్యవహరిస్తూ వస్తోంది. మరోపక్క ఆమె పిల్లల భవిష్యత్తును కూడా సెట్ చేసినట్టు అయ్యింది. అయితే సునీత ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తన రెండో పెళ్లి చేసుకోవడం గురించి కొన్ని ఊహించని కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. “నా 28 ఏళ్ల కెరీర్లో 5 వేలకి పైగా షోలు చేశాను. మొదట్లో నా గొంతు హస్కీగా ఉందని, కొన్ని మాటలు గొంతులోనే ఆపేస్తుందని చాలా మంది విమర్శలు చేశారు. అయితే నేను స్డూడియోను దేవాలయంలా భావించేదాన్ని. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు స్టూడియో బయటే వదిలేసి లోపలికి వెళ్లేదాన్ని. స్డూడియోలో పర్సనల్స్ మాట్లాడేదాన్ని కాదు. కానీ, ఆ విషయంలో కొన్ని కామెంట్లు నన్ను బాధించాయి.
నేను కూడా చాలా సెన్సిటివ్. ప్రతి దానికి ఏడ్చేసేదాన్ని. 2 వ పెళ్లి చేసుకోవడం అనేది నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయంగా నేను భావిస్తాను. నేను 17 ఏళ్లకే సినిమాల్లోకి అడుగుపెట్టాను, 35 ఏళ్లు వచ్చే వరకు కష్టపడుతూనే ఉన్నాను. కొంతమంది నన్ను మోసం చేశారు. అన్నీ తట్టుకుని నిలబడగలిగాను” అంటూ (Singer Sunitha) సునీత చెప్పుకొచ్చింది
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!