భారీ రేటుకి సూర్య సినిమా!

  • July 12, 2016 / 01:37 PM IST

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య. ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకొని తను నటించే ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాడు. పబ్లిసిటీ విషయంలో కూడా సమాన ప్రాధాన్యత ఇస్తాడు. సూర్య ప్రస్తుతం ‘సింగం 3’ సినిమాలో నటిస్తున్నాడు. మొదటి రెండు భాగాలు హిట్ కావడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.

దీంతో బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. ఇటీవల ఈ సినిమా ఆంధ్రా, నైజాం హక్కులను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన మల్కపురం శివకుమార్ సుమారుగా 18 కోట్ల రూపాయల ఫ్యాన్సీ రేట్ ఇచ్చి మరీ పొందారు. హరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనుష్క, శృతిహాసన్ హీరోయిన్లు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus