Sir Collections: ఇక్కడ సూపర్ హిట్.. అక్కడ మాత్రం ఇంకా చాలా రాబట్టాలి..!

  • February 20, 2023 / 02:12 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన బైలింగ్యువల్ మూవీ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ‘శ్రీకర స్టూడియోస్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ‘మాస్టారు మాస్టారు’ అనే పాట అలాగే టీజర్, ట్రైలర్ లు సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.ఇక ఫిబ్రవరి 17న విడుదల అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.

దీంతో కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయని చెప్పాలి.రెండో రోజు కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే :

నైజాం 3.52 cr
సీడెడ్ 1.21 cr
ఉత్తరాంధ్ర  1.12 cr
ఈస్ట్ 0.87 cr
వెస్ట్ 0.35 cr
గుంటూరు 0.70 cr
కృష్ణా 0.61 cr
నెల్లూరు 0.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.71 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.64 cr
తమిళనాడు 9.50 cr
ఓవర్సీస్ 6.07 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 26.92 cr (షేర్)

‘సార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకే ఇక్కడ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ.8.71 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.3.21 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ మూవీకి రూ.33.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

అలా చూసుకుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.34 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మూడు రోజులు పూర్తయ్యేసరికి రూ.26.92 కోట్ల షేర్ ను రాబట్టింది. సో ఓవరాల్ గా ఇంకో రూ.7.08 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తమిళ్ లో ఈ మూవీకి రూ.18.2 కోట్ల బిజినెస్ జరిగితే.. అక్కడ ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి కేవలం రూ.9.5 కోట్ల షేర్ నే రాబట్టడం గమనార్హం.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus