‘బిగ్ బాస్’ కు పర్ఫెక్ట్ హోస్ట్ నాగార్జునే అని అంతా అంటుంటారు.ఆయన హోస్ట్ చేస్తున్నప్పటి నుండీ రేటింగ్ లు అదిరిపోతున్నాయి. ప్రీమియర్ లు అయినా.. గ్రాండ్ ఫినాలేలు అయినా..నాగ్ హోస్ట్ చేస్తున్నప్పటి నుండీ రేటింగ్ ను నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి. అందుకే గత 3 సీజన్లుగా హోస్ట్ గా నాగార్జుననే రిపీట్ చేస్తూ వస్తున్నారు. అయితే శని వారం రోజున హోస్ట్ ఓ రేంజ్లో క్లాస్ పీకి కంటెస్టెంట్ చేస్తున్న తప్పులని సరిదిద్దాల్సి ఉంటుంది.ఈ సీజన్ లో నాగ్ ఇది చేయడం లేదు.
హౌస్మేట్స్ సమర్ధించుకుంటుంటే ఆల్ రైట్ అంటూ మాట పాస్ చేసేస్తున్నారు. లేదంటే కామ్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా షణ్ముఖ్, సిరి లను నాగ్ ఎక్కువగా ఏమీ అనడం లేదు. వారి మితిమీరిన హగ్గులు, ముద్దులకి సోషల్ మీడియాలో బోలెడన్ని సెటైర్లు వస్తున్నా అవి నాగ్ వరకు వెళ్లడం లేదో ఏమో కానీ.. నాగ్ మాత్రం ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదు. పైగా ‘నాగ్ కు రొమాన్స్ అంటే బాగా ఇష్టం’ అనే కామెంట్లు కూడా ఎక్కువయ్యాయి.
ఇటీవల సిరి తల్లి హౌస్లోకి వెళ్ళినప్పుడు సిరి పై ప్రేమ ఎలా చూపించిందో అదే విధంగా బుద్ధి కూడా చెప్పిందని చెప్పాలి. ‘షణ్ముఖ్ తో నీ హగ్గులు,ముద్దులు నాకు నచ్చడం లేదు’ అంటూ షణ్ముఖ్ కి గట్టి కౌంటరే ఇచ్చింది. ఈ విషయాన్ని బేస్ చేసుకుని కూడా నాగార్జునని ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?