Siri Remuneration: వామ్మో.. సిరి భారీగానే అందుకుంది కదా..!

  • December 20, 2021 / 07:00 PM IST

‘బిగ్ బాస్5’ లో టాప్ 5 వరకు చేరుకున్న ఒకే ఒక్క ఫిమేల్ కంటెస్టెంట్ సిరి హనుమంతు. అయితే టాప్ 5లో మొదట ఎలిమినేట్ అయ్యింది సిరినే కావడం మరో విశేషం. మొదటి వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించింది సిరి. అయితే తర్వాత ఈమె ప్రతీ విషయానికి ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకోవడం.. ఆ క్రమంలో మరో యూట్యూబర్ కం కంటెస్టెంట్ అయిన షణ్ముఖ్ వచ్చి… ఓదార్చడం, ఫలితంగా ఈమె ముద్దులు, హగ్గులు ఇవ్వడం వంటివి

ఈమె పై నెగిటివిటీ స్టార్ట్ అవ్వడానికి కారణాలు అయ్యాయి. దాంతో ఈమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అయినప్పటికీ ఇంత నెగిటివిటీలో కూడా ఈ సీజన్‌లో ఈమె 15 వారాల పాటు హౌస్ లో కొనసాగడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. అయితే 15 వారాలకి గాను ఈ ఎంత పారితోషికం అందుకుని ఉండొచ్చు అనే డౌట్ చాలా మందిలో ఉంది. సోషల్ మీడియాలో అయితే ఈ విషయం పై చాలా డిస్కషన్లు జరుగుతున్నాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. సిరికి ఒక్క వారానికి గాను రూ.1.5లక్షల నుండీ రూ.2 లక్షల వరకు పారితోషికం ఆఫర్ చేశారట ‘బిగ్ బాస్5’ వాళ్ళు. ఆ లెక్కన చూసుకుంటే సిరి మొత్తంగా రూ.25 లక్షల వరకు పారితోషికం అందుకుందని సమాచారం.విన్నర్ కాకపోయినా ఇది కూడా భారీ పారితోషికమే అని చెప్పాలి. పలు యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన సిరి ‘నరసింహపురం’ ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus