Mrunal Thakur: సౌత్ సినిమాలపైనే దృష్టి పెట్టిన మృణాల్ ఠాకూర్.. కారణం?ట్టిన మృణాల్ ఠాకూర్.. కారణం?

  • March 11, 2023 / 01:05 PM IST

మృణాల్ ఠాకూర్.. ‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ తన లుక్స్ తో, పెర్ఫార్మన్స్ తో అమితంగా ఆకట్టుకుంది. సీతగా అలాగే నూర్ జాన్ గా రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన ఈ పాత్రను ఎంతో చక్కగా చేసి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ ఒక్క సినిమాతోనే ఇక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్ ఠాకూర్. అయితే ఈ సినిమా తర్వాత ఈమె ఇక్కడ బిజీ అయిపోవడం ఖాయమని..

మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఈమె ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతా భావించారు.కానీ అలాంటిదేమి జరగలేదు. అందుకు కారణం.. ఈమె పారితోషికం భారీగా పెంచేయడం అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది మాత్రం నచ్చిన పాత్రలనే ఈమె ఓకే చేస్తుంది అని అంతా అంటున్నారు. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది ఈ బ్యూటీ.

నాని కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ ఈ మధ్యనే కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ కు నాని కొంచెం గ్యాప్ ఇచ్చాడు. మరోపక్క హిందీ సినిమాల్లో కూడా ఈమె వరుసగా నటిస్తుంది కానీ అవి పెద్దగా ఆడటం లేదు. ఆడిన సినిమాలకు కూడా ఈమెకు పేరు రావడం లేదు. సౌత్ లో అయితే ఈమెకు ప్రత్యేక గుర్తింపు, మర్యాద లభిస్తుంది.

ఇటీవల ఈమె తమిళ, మలయాళంలో సినిమాలు చేయడానికి సైన్ చేసిందని వినికిడి. అక్కడ దర్శకుల ఇంకా చాలా మంది వచ్చి ఈమెకు కథలు వినిపిస్తున్నారట. సూర్య 42 వ చిత్రంలో మృణాల్‌ హీరోయిన్ గా ఎంపికైంది. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus