Sitara: ఆ విషయాలన్నీ జ్ఞాపకంగా మారిపోయాయి.. సితార పోస్ట్ వైరల్?

సూపర్ స్టార్ కృష్ణ నిన్న తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.మరి కాసేపట్లో ఈయన అంత్యక్రియలు కూడా పూర్తికానున్నాయి. కృష్ణ మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్ కి గురవ్వడమే కాకుండా సినీ లోకం మొత్తం తరలివచ్చి ఆయనని చివరిసారిగా చూసి తనకు నివాళులు అర్పించారు. ఇక మరి కాసేపట్లో కృష్ణ అంత్యక్రియలు కూడా పూర్తికానున్నాయి. ఇకపోతే కృష్ణ గారు బ్రతికున్నప్పుడు తాను ఎక్కువగా తన కూతుర్ల వద్ద లేదా తన ఫామ్ హౌస్ లో నివసించేవారు.

అయితే కృష్ణ గారు ఎక్కడ ఉంటే తన కుటుంబ సభ్యులందరూ కూడా వీకెండ్ అక్కడికే వచ్చి ఆయనతో కలిసి భోజనం చేసి ఎంతో సరదాగా గడిపేవారు. ఇక మహేష్ బాబు సైతం హైదరాబాదులో ఉంటే తప్పనిసరిగా వీకెండ్ రోజున తన తండ్రి వద్దకు వెళ్లేవారు ఇక సితార గౌతం సైతం తన తాతయ్యతో ఎంతో మంచి అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈ విధంగా సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

అయితే తన తాతయ్య కృష్ణ గారు చనిపోవడంతో ఈమె తన తాతయ్యతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం సితార షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపై వీకెండ్స్ ఎప్పుడూ కూడా మునపటిలా ఉండవు తాతయ్య.. మీరు మా పట్ల ఎంతో ప్రేమను చూపించి మాకు ఎన్నో విలువైన విషయాలను తెలియచేశారు. ఇక ఆ విషయాలన్నీ కూడా ఓ జ్ఞాపకంలా మిగిలిపోయాయి.

మీరే నా హీరో ఎప్పటికైనా మీరు గర్వపడేలా చేస్తాను ఐ మిస్ యు తాతగారు అంటూ సితార సోషల్ మీడియా వేదికగా తన తాతయ్య పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus