బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం రెండోరోజు కూడా నామినేషన్స్ నడిచాయి. శోభాశెట్టి క్లారిఫికేషన్ ఇస్తూ రతికని నామినేట్ చేసింది. పౌల్ గేమ్ నువ్వు కూడా ఆడావ్ అని నిరూపించింది. ఇక్కడే తన యాటిట్యూడ్ కూడా రతికకి చూపించింది. అర్ధం లేని పాయింట్ పట్టుకుని రతిక ఎప్పటిలాగానే ల్యాగింది. ఆ తర్వాత శోభా యావర్ ని నామినేట్ చేసింది. కెప్టెన్సీ కంటెండర్ గా నన్ను మిర్చి దండ వేసి తీసేశావ్, అప్పుడు చెప్పిన రీజన్ నాకు నచ్చలేదని చెప్పింది. దీనికి కౌంటర్ గా యావర్ తిరిగి శోభాశెట్టిని నామినేట్ చేస్తూ, నువ్వు పౌల్ గేమ్ ఆడావ్ కెప్టెన్సీకి ఎలా డిసర్వ్ అని అనుకున్నావ్ అని తెలివిగా మాట్లాడాడు.
దీంతో శోభాశెట్టి నామినేషన్ ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత అసలైన యుద్ధం జరిగింది. యావర్ అశ్వినిని నామినేట్ చేస్తూ నువ్వు కన్ఫూజన్, లో-లెవల్ ఆఫ్ అండర్ స్టాండింగ్ అన్నాడు. ముందు అర్జున్ ని నామినేట్ చేద్దాం అనుకున్నావ్ కానీ కన్ఫూజ్ అయ్యి అమర్ ని చేశావ్ ఇలా లాస్ట్ టైమ్ కన్ఫూజన్ అయ్యావ్, అలాగే ప్రియాంక విషయంలో ఆమె ఓన్లీ మైండ్ గేమ్ మాత్రమే ఆడింది, ఫిజికల్ గేమ్ ఆడినవాళ్లకంటే తను డిసర్వ్ కాదు అని చెప్పి కెప్టెన్సీ రేస్ నుంచీ తొలగించావ్ అది నాకు నచ్చలేదు అని చెప్పాడు. దీనికి అశ్విని బాగా హర్ట్ అయ్యింది. తిరిగి యావర్ ని నామినేట్ చేస్తూ సివంగిలాగా రెచ్చిపోయింది.
అసలు నీకు తెలుగు రాదు, బిగ్ బాస్ షోకి ఎందుకు వచ్చావ్, పాయింట్ చెప్తే అర్దం చేస్కోలేకపోతున్నావ్ అంటూ విరుచుకు పడింది. ఈ గొడవ నామినేషన్స్ తర్వాత అశ్విని ఏడ్చేలా చేసింది. తను ఏడుస్తూ వెళ్లినపుడు యావర్ తో కలిసి అర్జున్, రతిక, ప్రశాంత్ ముస్తఫా.. ముస్తఫా అంటూ పాటపాడారు. ఆ తర్వాత అశ్విని రతికని సైతం నామినేట్ చేసింది. ఫైనల్ గా గౌతమ్ అమర్ ని – రతికని నామినేట్ చేసి నామినేషన్స్ ని ముగించాడు. దీంతో ఈవారం 8మంది నామినేషన్ లోకి వచ్చారు. ఈ నామినేషన్స్ తర్వాతే అశ్విని ఏడ్చింది. ఎందుకంటే., ప్రియాంకతో బెడ్ రూమ్ లో మాట్లాడుతున్న అశ్విని యావర్ చెప్పిన రీజన్ అసలు అర్దం ఉందా అంటూ అడిగింది.
నేను నిన్ను తీసేస్తే యావర్ కి ఏంటి ప్రాబ్లమ్. అయినా నేను నిన్ను ఓన్లీ మైండ్ గేమ్ మాత్రమే ఆఢి గెలిచావ్, అందరిలాగా ఫిజికల్ గేమ్ ఆడి, కష్టపడింది లేదు అనేది నా ఉద్దేశ్యం అంటూ చెప్పబోతుంటే, ప్రియాంక కట్ చేసింది. అస్తమానం నేను మైండ్ గేమ్ ఒక్కటే ఆడి గెలిచా అని నువ్వు స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నావ్ వద్దు వదిలేయ్ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అశ్విని బరెస్ట్ అయ్యింది. ప్రియాంక అన్న మాటలకి బాధపడింది. ఏడుస్తూ కూర్చుంది. అక్కడికి వచ్చిన శివాజీతో జరిగింది చెప్పింది. దీనికి శివాజీ మీఊరికి ఆఊరు ఎంత దూరమో, ఆఊరికి మీఊరు కూడా అంతే దూరం అంటూ సర్ధి చెప్పాడు.
బుద్దులు చెప్పాడు. నీ పాయింట్ నువ్వు చెప్పావ్, వాళ్ల పాయింట్ వాళ్లు చెప్పారు. ఇందులో తప్పులేదు అని ఓదార్చాడు. ఆ తర్వాత ఇదే విషయంలో అశ్విని గార్డెన్ ఏరియాలో కూర్చుని మరీ ఏడుస్తుంటే పల్లవి ప్రశాంత్ వచ్చాడు. అప్పుడు కూడా ఇదే విషయాన్ని అశ్విని చెప్పింది. క్లియర్ గా ప్రియాంక విషయంలో తను ఆడిన గేమ్ ని బయట పెట్టడానికి ఇలా చేస్తుందా అని కూడా అనిపించింది. అంతేకాదు, ప్రశాంత్ ఈసారి నువ్వు టాస్క్ బాగా ఆడు అప్పుడు మొత్తం సెట్ అవుతుంది అని సలహా ఇచ్చాడు. మొత్తానికి అదీ మేటర్.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!