ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు చిత్రాలతో పాటు, తమిళ సినిమాలను కొనుగోలు చేస్తున్నారు. విజయ దశమికి తమిళనాడులో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న రెమో చిత్రాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. దీనిని తెలుగులో డబ్ చేసి త్వరలో విడుదల చేయనున్నారు.
బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెమోలో యువనటుడు శివ కార్తికేయన్ నర్స్ గా ఆడవేషంలో చక్కగా నటించి, నవ్వించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆర్.డీ.రాజా నిర్మించిన ఈ మూవీ విజయం సాధించడంతో చిత్ర బృందం చెన్నైలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన సినిమా విడుదలను కొందరు అడ్డుకున్నారని బాధపడ్డారు.
“నేను ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు. నా పని నేను చేసుకుంటూ పోతున్నా ఎందుకు ఇలా అడ్డు పడుతున్నారు” అని మీడియా ముందు శివ కార్తికేయన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగులో అటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ థియేటర్లలో రెమో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి దిల్ రాజు పక్కా ప్లాన్ తో ఉన్నారు.