Skanda: రామ్ బోయపాటి కాంబో మూవీ స్కంద బుకింగ్స్ అలా ఉన్నాయా?

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ హీరోగా తెరకెక్కుతున్న స్కంద సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే మొదలు కాగా హైదరాబాద్ లో ఈ సినిమా బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ప్రముఖ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. శ్రీలీల ఈ సినిమాలో నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. స్కంద మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.

స్కంద సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్ అనేలా ఉండనుందని ఆ టిస్ట్ తో అప్పటివరకు చూసిన సినిమాపై అభిప్రాయం పూర్తిగా మారిపోతుందని బోగట్టా. రామ్ రెండే షేడ్స్ లో కనిపించనుండగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నాయని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ సినిమా యాక్షన్ సీన్ల కోసం ఎంతో కష్టపడ్డానని హీరో రామ్ ఎంతగానో కష్టపడ్డారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా ఉండనున్నాయని తెలుస్తోంది. స్కంద సినిమా బోయపాటి శ్రీనుకు మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోయపాటి శ్రీను ఈ సినిమా తర్వాత సూర్య సినిమాతో బిజీ కానున్నారు. బోయపాటి శ్రీను ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే ఆయన పారితోషికం కూడా పెరిగే అవకాశం అయితే ఉంది.

70 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ రేంజ్ ను ఈ సినిమా ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాలి. రామ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. హీరో రామ్ కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని పాన్ ఇండియా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus