Skanda Movie: స్కంద మూవీ రైట్స్ ఆ రేంజ్ లో అమ్ముడయ్యాయా?

  • August 31, 2023 / 04:54 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల రేంజ్ ఏ స్థాయిలో ఉందో, ఆమెకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కంద సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. శ్రీలీల ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా టీవీ, ఓటీటీ హక్కుల గురించి తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి. స్కంద సినిమా టీవీ, డిజిటల్ హక్కులు ఏకంగా 85 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఆడియో రైట్స్ సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని భోగట్టా. స్కంద మూవీ థియేట్రికల్ హక్కులు 60 కోట్ల రూపాయలు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. శ్రీలీల క్రేజ్ వల్లే స్కంద మూవీ హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. విడుదలకు ముందే ఈ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం.

కలెక్షన్లతో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను అందించింది. వినాయక చవితి పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రామ్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. బోయపాటి శ్రీను ఈ సినిమాతో అఖండ సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

స్కంద (Skanda Movie) సినిమాపై రామ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. త్వరలో రిలీజ్ కానున్న మరో ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుందేమో చూడాలి. రామ్ కు కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. కథల ఎంపికలో రామ్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus