ఎస్ కె ఎన్ కి(SKN) వార్తల్లో నిలవడం అంటే బాగా ఇష్టం. ప్రతి సినిమా ఈవెంట్ కి వెళ్లడం.. అక్కడ అందరి అటెన్షన్ డ్రా చేసేలా ఏదో ఒకటి మాట్లాడి హాట్ టాపిక్ అవ్వడం ఎస్ కె ఎన్ కి అలవాటు కూడా..! మొన్నటికి మొన్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా సక్సెస్ మీట్..కి, మేకర్స్ ఎవ్వరూ పిలవకపోయినా వెళ్లి.. స్పీచ్ ఇచ్చాడు. అలాంటి ఎస్ కె ఎన్.. ఇప్పుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన కామెంట్స్ ను టార్గెట్ చేసి.. వాటి ద్వారా హైలెట్ అయ్యే ప్రయత్నం చేశాడు.
విషయంలోకి వెళితే.. ఇటీవల శివాజీ ‘హీరోయిన్లు నిండుగా చీరకట్టుకోండి’ అంటూ కామెంట్లు చేశాడు. ఈ క్రమంలో రెండు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు. దీంతో ఇండస్ట్రీలో ఉన్న ఫెమినిస్ట్..లు అలాగే మహిళా సంఘాల వారు అతన్ని టార్గెట్ చేసి వేధిస్తున్న సంగతి తెలిసిందే.మరోవైపు ఎస్ కె ఎన్ తాజాగా ‘పతంగ్’ సినిమా సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వెళ్ళాడు. అక్కడ అతను మాట్లాడుతూ….. “హీరోయిన్లూ మీకు ఏ డ్రెస్ కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకోండి.
ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్ ఇస్తే అది వేసుకోండి. ఏ బట్టల సత్తిగాడి మాటలూ విననవసరం లేదు. కాన్ఫిడెన్స్ అనేది హార్ట్ నుండి వస్తుంది. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఏదో అయిపోతారు అనేది ఏమీ లేదు. ఏం జరిగినా మన మనసు మంచిగా ఉంటే మంచిగా ఉంటాం. మన ఇంటెన్షన్ మంచిగా ఉంటే మంచి జరుగుద్దే తప్ప.. డ్రెస్సుల్లో ఉండదు.మన టాలెంట్ కి ఉన్న అడ్రస్సుల్లో ఉంటది” అంటూ పరోక్షంగా శివాజీకి చురకలు అంటించాడు ఎస్ కె ఎన్.