‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది స్నేహా ఉల్లాల్. స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉండే ఈ బ్యూటీని జూనియర్ ఐశ్వర్య అని పిలుచుకునేవారు. అయితే ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ‘నేను మీకు తెలుసా’, ‘కరెంట్’, ‘వరుడు’ లాంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో అమ్మడు కెరీర్ ప్రశ్నార్థంగా మారింది. ‘సింహా’తో హిట్ అందుకున్నప్పటికీ ఆ హిట్ బోయపాటి ఖాతాలోకి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ‘మడతకాజా’, ‘యాక్షన్ త్రీడీ’ లాంటి అట్టర్ ప్లాప్ సినిమాల్లో కనిపించింది. దీంతో టాలీవుడ్ లో ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. చాలా కాలం తరువాత ఈమెకి ‘ఎక్స్పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఇది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.
ఇందులో ఆమె బ్యాక్ లెస్ పోజుతో ఓ ఉసక్తిని కౌగిలించుకొని బెడ్ పై కనిపిస్తోంది. దీనికి ‘నేను కాదు.. కానీ నేనే కావచ్చు’ అంటూ ఓ ట్యాగ్ జోడించింది. ఈ ఫోటో చూసిన వారంతా కూడా షాకవుతున్నారు. సడెన్ గా ఆమె ఇలాంటి ఫోటో షేర్ చేయడం వెనుక మ్యారేట్ ఏమై ఉంటుందని ఆరా తీస్తున్నారు.