Sobhita, Naga Chaitanya: నాగచైతన్య తో ప్రేమ, పెళ్లి.. ఘాటుగా స్పందించిన శోభిత ధూళిపాళ..!

2021 వ సంవత్సరం గాంధీ జయంతి రోజు అంటే అక్టోబర్ 2న నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి అంతకు ముందు నుండీ వాళ్ళు సెపరేట్ గా ఉంటూ వచ్చారు.. అఫీషియల్ గా మాత్రం అప్పుడు అనౌన్స్ చేశారు. విడిపోయిన తర్వాత చైతన్య, సమంత ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయిపోయారు.ఇద్దరూ కూడా సక్సెస్ లు అందుకుంటున్నారు. అయితే కొద్ది రోజుల నుండీ నాగచైతన్య… ‘మేజర్’ హీరోయిన్ శోభిత ధూళిపాళ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందుకు కారణం చైతన్య కొత్త ఇంటికి శోభిత వెళ్లి వస్తుండటమే అని తెలుస్తుంది. అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు చైతన్య స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు. సాధారణంగా ఇలాంటి విషయాల పై సెలబ్రిటీలు వెంటనే స్పందించి క్లారిటీ ఇస్తుంటారు. కానీ చైతన్య ఇప్పటివరకు క్లారిటీ ఇచ్చింది లేదు.మంచి సమయం కోసం చూస్తున్నాడు అనుకుంట. అయితే హీరోయిన్ శోభితా ధూళిపాళ మాత్రం పరోక్షంగా ఈ విషయం పై స్పందించినట్టు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.

గత కొన్ని గంటలుగా శోభిత కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఆమె ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో కెమెరా వైపు నవ్వుతూ చూసి హాయ్ అన్నట్టు చెయ్యి ఊపి.. ఒక్కసారిగా కోపంగా మొహం పెట్టి మిడిల్ ఫింగర్ చూపించింది శోభిత. దీంతో చైతన్య తో ఆమెను లింక్ పెడుతూ వచ్చిన వార్తల పై ఆమె ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది అని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు.

మరి చైతన్య ఈ విషయం పై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇక ఇటీవల ‘మేజర్’ తో సక్సెస్ అందుకున్న శోభిత..ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా నటిస్తోంది. మరోపక్క నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీతో జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అలాగే ఆగష్టులో అతను కీలక పాత్ర పోషించిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా విడుదల కానుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus