హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల అందరికీ సుపరిచితమే. ‘గూఢచారి’ ‘కురుప్’ ‘మేజర్’ ‘పొన్నియన్ సెల్వన్ -1’ వంటి హిట్ సినిమాల్లో నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఈమెను చూస్తే బాలీవుడ్ నుండి దిగుమతి అయిన అమ్మాయి అని అంతా అనుకుంటారు. కానీ కాదు..! శోభిత ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన అమ్మాయి.బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. శోభిత ఎంపిక చేసుకునే పాత్రలు కూడా బాగుంటాయి.
ఇంకా ఈమె గురించి చెప్పాలి అంటే.. మొన్నామధ్య నాగ చైతన్యని పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. అందులో నిజం లేదని శోభిత అలాగే నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఇదిలా ఉండగా.. గతంలో ఈమెను ‘బ్యాక్ రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేయవు’ అంటూ కొంతమంది అన్నారట.
ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ.. “నా 20 ఏళ్ళ వయసులో ఓ షాంపు యాడ్ కోసం సంప్రదించగా.. అక్కడి మేకర్స్ నేను అందంగా లేను. కనీసం బ్యాక్ రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేయవు అంటూ అవమానించారు. కానీ నేను ఆ టైంలో ఏమీ అనలేదు. ఇప్పుడు అదే కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది శోభిత ధూళిపాళ్ల. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక శోభిత నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!