బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఊహించినట్లుగానే 10వ వారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యిపోయాడు. తన పేరులో ఉన్నట్లుగానే అందరి దిల్ గెలుచుకుని మరీ ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ వెళ్లిపోతుంటే , హౌస్ లో అందరూ ఎమోషనల్ అయ్యారు. నిజానికి కనెక్ట్ అయిన సోహైల్ – అఖిల్ లతో పాటుగా హారిక, అభిజిత్, లాస్య, అవినాష్ లు కూడా ఎమోషనల్ అవ్వడం బాధపడటం అనేది మెహబూబ్ గేమ్ ని ఒక్కసారిగా ప్రేక్షకులకి చూపించింది.
ఇక సోహైల్ ఊహించినట్లుగానే సోహైల్ ని – మెహబూబ్ ని పెట్టి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చేశారు. లాస్ట్ వరకూ కూడా సోహైల్ ని దీనికోసమే ఆపారు. దీనివల్ల అతని చేతిలో ఎలిమినేట్ అయినంత బాధపడ్డాడు సోహైల్. చిన్నపిల్లాడిలా ఏడుస్తూ మోహబూబ్ కోసం చాలా ఎమోషనల్ అయిపోయాడు సోహైల్. ఇక స్టేజ్ పైన కూడా మెహబూబ్ తన బాధని హౌస్ మేట్స్ తో పంచుకున్నాడు. భారీ డైలాగ్స్ తో, హై డ్రామాతో సాగిన ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకుల హృదయాలని సైతం కదిలించింది.
మెహబూబ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ హౌస్ లో నుంచి వెళ్లిపోయిన తర్వాత హౌస్ మేట్స్ ఇప్పుడు గేమ్ ని ఎలా అర్ధం చేస్కుంటారు..? ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!