ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం విన్నర్ సోహైల్

  • December 21, 2020 / 10:33 AM IST

గత వంద రోజులుగా హడావుడి చేసిన “బిగ్ బాస్ 4″కి నిన్న తెరపడింది. ముందుగా లీక్ అయినట్లు అభిజీత్ విన్నర్ అయిపోయాడు, అఖిల్ రన్నర్ గా మిగిలాడు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా సోహైల్ మాత్రం క్యాష్ తీసుకొని హౌజ్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో ఆడియన్స్ కొంతమేరకు నిరాశ చెందారు. అయితే.. విన్నర్ అభిజిత్ గెలుచుకున్న క్యాష్, టైటిల్ విన్నర్ ట్రోఫీ, అపాచీ బైక్ కంటే విలువైన బహుమతులను గెలుచుకున్నాడు సోహైల్.

బిగ్ బాస్ 25 లక్షల క్యాష్, చిరంజీవి 10 లక్షలు, నాగార్జున 10 లక్షలు, చిరంజీవి నుంచి అభినందనలు, మెగాస్టార్ ఇంటి నుంచి మటన్ బిర్యాని, అందరికంటే ఎక్కువ రిసెప్షన్ & ఫుటేజ్. ఇలా సోహైల్ గెలుచుకున్న బహుమతుల లిస్ట్ చాలా పెద్దది. ఈ లెక్కన విన్నర్ అభిజిత్ కంటే.. ఓడిపోయి మరీ సోహైల్ గెలుచుకుంది ఎక్కువ అనే చెప్పాలి. అలాగే.. హౌజ్ లో పెద్దగా యాక్టివ్ గా లేని (చిరంజీవి కూడా అదే అన్నారు) అభిజిత్ కంటే..

అన్నీ టాస్క్స్ లో పార్టిసిపేట్ చేసి, అందరితో కలిసిపోయి, కొందరితో గొడవపడి, షోను రక్తి కట్టించడంలో పెద్ద పాత్ర పోషించిన సోహైల్ ఆడియన్స్ చాంపియన్. మరి సోహైల్ కథ ఇప్పుడు ఎలా ఉంటుంది? వచ్చిన అవకాశాన్ని అతడు ఎలా వినియోగించుకుంటాడు అనేది చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus