బిగ్‌బాస్ ‘ఉక్కు హృదయం’ పేరుతో ఏ ముహూర్తాన టాస్క్ ఇచ్చాడో గానీ… మొత్తం ఇంటి వాతావరణాన్ని మార్చేసింది. ఆ రోజు అభిజీత్ తెలివిగా ఆలోచించి ‘దివి కిడ్నాప్’ ఫార్ములా తీసుకొచ్చాడు. విజయవంతంగా అమలు చేసి గెలిచాడు, గెలిపించాడు కూడా. అయితే ఆ విషయం ఇంకా ఇంటి సభ్యులు వదలడం లేదు. ఏ మాట వచ్చినా ‘దివి కిడ్నాప్’ టాపిక్ తీసుకొస్తున్నారు.
మంగళవారం ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. నోయల్, అభిజీత్, సోహైల్, మెహబూబ్ కలసి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మెల్లగా మొదలైన ఈ టాపిక్ ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే వరకు వెళ్లింది. దివి కిడ్నాప్ టాపిక్ ఎత్తినప్పుడు… ‘కోపంలో మాటలు తూలాయి… మంచి పద్ధతి కాదు’ అంటూ సోహైల్‌ను అభిజీత్ సూచించాడు. అయితే దాన్ని సోహైల్ సీరియస్‌గా తీసుకున్నాడు. అమ్మాయిల్ని పెట్టి గేమ్ ఆడావు… మగాడిలా ఆడలేదు అంటూ అభిజీత్‌ను ప్రొవోక్ చేశాడు. దీంతో అభి అదే తీరులో గట్టిగానే సమాధానమిచ్చాడు.
‘ఆడ పిల్లలతో పని చేయించుకుని నువ్వు ఛార్జింగ్ పెట్టుకున్నావ్’ అంటూ అభిజీత్‌ను సోహైల్ ఎద్దేవా చేశాడు. దానికి నువ్వు ‘ఆడపిల్లలతో గీకించుకున్నావ్’ అని అభిజీత్ అన్నాడు. దమ్ము లేకపోవడం వల్ల టాస్క్ సమయంలో బయట ఆడకుండా… పక్కకు ఉండిపోయావ్ అంటూ సోహైల్ మంట పెంచాడు. దీంతో అప్పటికే చాలాసేపటి నుంచి చర్చిస్తున్న అభిజీత్ ‘కండలు కాదు.. బుర్రవాడు’ అంటూ సోహైల్‌కు సూచించాడు. ఆ మాటకు సోహైల్ ఊరుకోకుండా ‘అభి భయపడుతున్నాడు… ఫిజికల్ టాస్క్ ఇవ్వొద్దు’ అంటూ బిగ్‌బాస్‌తో సెటైరికల్‌గా చెప్పాడు సోహైల్. బిగ్‌బాస్ కరెక్ట్ అని చెప్పినా… మీరు ఇలా మేం తప్పు చేశాం అని అనడం బాగోలేదు అంటూ అభిజీత్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. చూద్దాం ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటుందో?