ఈమధ్య సోషల్ నేత్వరింగ్ సైట్ల ద్వారా తమ అభిమాన కథానాయకుడిని ఆరాధించడం కంటే.. ఇతర కథానాయకులను కించపరచడం ఎక్కువయ్యింది. ఈమధ్య ఈ పద్ధతి మరీ శృతి మించుతోంది. మొన్న “బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాల విడుదల సమయంలో ట్విట్టర్ పుణ్యమా అని జరిగిన రచ్చ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ మీద కొంతమంది తమదైన శైలిలో రెచ్చిపోయారు.
చిత్రవిచిత్రంగా అభిషేక్ బచ్చన్ ను ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. ఈ విషయమై మొదట్లో కాస్త గట్టిగా జవాబిచ్చిన అభిషేక్ బచ్చన్,, నేడు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. “నన్ను ద్వేషించేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, నా గురించి నా కంటే ఎక్కువగా ఆలోచించేది వాళ్ళే” అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు!