Balakrishna: మొన్న చిరు అన్నారు.. ఇప్పుడు బాలయ్య అంటున్నారు..!

  • July 3, 2021 / 06:43 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘అఖండ’ అనే భారీ మాస్ అండ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. విడుదల చేసిన టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య.. ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయింది. ఒకసారి సెట్స్ పైకి వెళితే.. 3 నెలల్లో సినిమా ఫినిష్ చేయాలని టీం భావిస్తుంది. కానీ ఒక్కటే సమస్య..! హీరోయిన్ ఇంకా ఓకే అవ్వలేదు. త్రిష‌, మెహ‌రీన్‌, శృతీ హాసన్ వంటి భామల పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళు ఈ ప్రాజెక్టుని ఓకే చేయలేదని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవ‌ల చిత్ర‌యూనిట్ సభ్యులు సోనాక్షిని సంప్ర‌దించారట.

కానీ ఆమె ఈ ప్రాజెక్టులో నటించడానికి `నొ` చెప్పిన‌ట్టు తెలుస్తుంది. సౌత్ లో సినిమాలు చేయ‌డానికి ఈ బ్యూటీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆల్రెడీ రజినీకాంత్ కు జోడీగా ‘లింగ’ సినిమాలో నటించింది. మొన్నటికి మొన్న చిరంజీవి సినిమాలో నటించడానికి కూడా ఈమె ఓకే చెప్పినట్టు టాక్ నడిచింది.కానీ.. బాల‌య్యకు ఈమె ‘నొ’ చెప్పడంతో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus