Sonu Sood: ప్రధాని కావాలన్న వ్యాఖ్యలపై సోనూసూద్ ఏమన్నారంటే..?

  • June 7, 2021 / 03:35 PM IST

రియల్ హీరో సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులలో చాలామంది కోరుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తే సోనూసూద్ మరింత ఎక్కువమందికి సేవ చేసే అవకాశం కలుగుతుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు కొన్నిరోజుల క్రితం ప్రముఖ నటి హ్యూమా ఖురేషి సోనూసూద్ పీఎం కావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా నెటిజన్లు సైతం సోనూసూద్ పీఎం కావాలని కోరారు. అయితే తాజాగా సోనూసూద్ తాను పీఎం కావాలంటూ జరుగుతున్న ప్రచారం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

హ్యూమా ఖురేషి మాటలతో తాను ఏకీభవించనని సోనూసూద్ చెప్పుకొచ్చారు. తాను పీఎం కావాలంటూ హ్యూమా ఖురేషి కామెంట్లు చేయడం ఆమె మంచితనమని సోనూసూద్ అన్నారు. తాను వయస్సు, అనుభవంలో చిన్నవాడినని పీఎం పదవికి తాను అర్హుడిని కాదని సోనూసూద్ వెల్లడించారు. ఏదో ఆశించి ప్రజలకు తాను సహాయం చేయడం లేదని సోనూసూద్ తెలిపారు. తన సంతృప్తి కొరకే సహాయ కార్యక్రమాలను చేపడుతున్నానని సోనూసూద్ అన్నారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాలపై ఆసక్తి అయితే లేదని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం మనకు సమర్థవంతమైన ప్రధాని ఉన్నారని సోనూసూద్ తెలిపారు. నటుడిగా సంతృప్తిగా రాణిస్తున్నానని పదవి, అధికారం లేకుండానే మనం కలిసి పని చేయగలమని అనుకుంటున్నానని సోనూసూద్ పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేని వారు చాలామందే ఉన్నారని సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ఆచార్య సినిమాలో నటిస్తున్న సోనూసూద్ హిందీలో పృథ్వీరాజ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus