Sonu Sood: విద్యార్థుల కోసం సోనూ సంచలన నిర్ణయం?

  • July 1, 2021 / 09:55 PM IST

కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఎంతోమంది పేదలకు, కరోనా వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు తన వంతు సహాయం చేసి సోనూసూద్ వార్తల్లో నిలిచారు. సోనూసూద్ ద్వారా సహాయం పొందిన వాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారంటే సోనూసూద్ గొప్పదనం సులభంగా అర్థమవుతుంది. కరోనా కేసులు తగ్గుతున్నా సోనూసూద్ మాత్రం తన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

ఐఏఎస్ చదవాలనుకునే పేద విద్యార్థులకు తన ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తానని సోనూసూద్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా సోనూసూద్ సీఏ చదవాలని భావించే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మరో అడుగు ముందుకు వేశారు. చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకునే పేద విద్యార్థులకు అండగా నిలబడటానికి సోనూసూద్ సిద్ధమయ్యారు. చార్టెడ్ అకౌంటెంట్ కావాలని భావించి సోనూసూద్ సాయం పొందాలనుకునే వారు https://soodcharityfoundation.org/ వెబ్ సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

రియల్ హీరో సోనూసూద్ రాజకీయాల్లోకి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి సోనూసూద్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. విద్యార్థుల కోసం సోనూసూద్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలను రాజకీయ నాయకులు సైతం మెచ్చుకుంటున్నారు. గతంలో సోనూసూద్ ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించగా దర్శకనిర్మాతలు ప్రస్తుతం పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను సోనూసూద్ కు ఆఫర్ చేస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus