Sonu Sood, Shiva Shankar Master: డాన్స్ మాస్టర్ ను ఆదుకున్న రియల్ హీరో!
- November 25, 2021 / 03:14 PM ISTByFilmy Focus
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమించింది. డాక్టర్లు ఆయన్ను రక్షించడానికి చాలానే శ్రమిస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్ కి రూపాయలు ఖర్చవుతున్నాయి. దీంతో దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలని కుటుంబసభ్యులు కోరారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం వైరల్ అవ్వడంతో శివశంకర్ మాస్టర్ ను ఆదుకోవడానికి చాలా మంది ముందుకొస్తున్నారు.

రియల్ హీరో సోనూసూద్.. సాయం చేయడానికి ముందుకొచ్చారు. శివశంకర్ కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్న ఆయన ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శివశంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లో పలు పాటలకు కొరియోగ్రఫీ అందించారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. ‘మగధీర’ సినిమాలో ‘ధీర.. ధీర.. ధీర’ పాటకు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. దీనికి గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. డాన్స్ మాస్టర్ గానే కాకుండా పలు సినిమాల్లో నటుడిగా కూడా అలరించారు.
నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?













