Sonu Sood: సోనూసూద్ కోసం కథ సెట్ చేసిన తెలుగు డైరెక్టర్

  • May 18, 2021 / 09:21 PM IST

వెండితెరపై విలన్ గా మెప్పించిన సోనూసూద్ రియల్ లైఫ్ లో హీరోగా నిలుస్తాడాని ఎవరు ఊహించలేదు. దేశ రాజకీయాల నాయకుల కన్నా అతను చాలా గ్రేట్ అని దేశవ్యాప్తంగా జనాలు గుర్తించే స్థాయికి ఎదిగాడు. కరోనా సెకండ్ వేవ్ లో సోనూసూద్ మరింత బాధ్యతాయుతంగా ఆక్సిజన్ ఫ్లాట్ వంటి నిర్మాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే సోనూసూద్ చేస్తున్న పనులకు దర్శకులు ఇక విలన్స్ క్యారెక్టర్స్ వేయించడం కరెక్ట్ కాదని డిసైడ్ అవుతున్నారు.

ఇక హీరోగా ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు క్రిష్ కూడా సోనూసూద్ కు కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ఆలోచబలో ఉన్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని క్రిష్, సోనూసూద్ కు అయితే ముందు నుంచి ఉన్న మంచి సాన్నిహిత్యం ద్వారా ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకుంటున్నారట. గతంలో క్రిష్ డైరెక్ట్ చేసిన మణికర్ణిక సినిమాలో సోనూసూద్ నటించిన విషయం తెలిసిందే.

అయితే కంగనా గొడవతో ఆ ఇద్దరు చివరికి అసంతృప్తిగానే ప్రాజెక్టు నుంచి వెనక్కి వచ్చేశారు. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్లాన్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే హిస్టారికల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus