చిరుతో మహేష్ కాంబినేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్!

  • March 1, 2020 / 04:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న సినిమాలో రామ్ చరణ్ చేయాల్సిన పాత్ర మహేష్ బాబు దగ్గరకి వెళ్లిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లితో సినిమా క్యాన్సిల్ కావడం, కొత్త సినిమా పట్టాలెక్కడానికి సమయం పట్టేలా ఉండడంతో చిరుతో కలిసి నటించడం మంచిదని భావిస్తున్నాడు మహేష్. పాత్రతో పాటు రెమ్యూనరేషన్ కూడా నచ్చడంతో మహేష్ దాదాపుగా ఈ సినిమా ఒప్పుకున్నట్లే అంటున్నారు.

ఇంకొన్ని రోజుల్లోనే దీనిపై స్పష్టం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చిత్ర యూనిట్ నుండి మహేష్ చేయబోయే పాత్రకి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు బయటకి వచ్చాయి. ఈ పాత్ర నిడివి దాదాపు 25 నిమిషాలు ఉంటుందట. అందులో చిరు, మహేష్ కాంబినేషన్ సీన్లు పదిహేను నిమిషాల వరకు ఉండొచ్చని సమాచారం. ఒక సోలో ఫైట్ చేయడంతో పాటు చిరుతో కలిసి మహేష్ ఒక పాటలో కనిపించే ఛాన్స్ ఉంది. అన్నీ సెట్ అయితే మహేష్ నెల రోజుల వరకు కాల్షీట్లు ఇవ్వాల్సి వుంటుంది. అయితే మహేష్ కి బదులుగా తనను తీసుకోవాలని అల్లు అర్జున్.. చిరు, చరణ్ లతో మాట్లాడుతున్నాడని మరో ప్రచారం జరుగుతోంది. మరో వారంలోపు ఈ విషయంపై క్లారిటీ రానుంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus