Suhas: సుహాస్ ఫస్ట్ సినిమా… ప్రమోషనల్ సాంగ్ కోసం స్పెషల్ సెట్
- July 13, 2026 / 05:03 PM ISTByFilmy Focus Desk
తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఆశా కిరణంలా కనిపించిన సుహాస్.. అనూహ్యంగా కథల ఎంపిక విషయంలో తప్పటగుడులు వేసి హిట్ ట్రాక్ నుండి పక్కకు తప్పిపోయాడు. అయితే, అనూహ్యంగా తమిళంలో ఎంట్రీకి రెడీ అయిపోయాడు. ‘మండాడి’ అంటూ ఓ సినిమాను కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబరు 10న సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
Suhas
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే ఈ సినిమా ప్రచారం కోసం టీమ్ చేస్తున్న ప్లానింగ్స్. సినిమల ప్రచారానికి ఓ పాటను వాడుకోవడం అనేది కొత్తేమీ కాదు. చాలా ఏళ్లుగా తెలుగులోనూ ఇలాంటి పాటలు చూస్తున్నాం. అయితే తమిళ తంబీలు ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇప్పుడు ‘మండాడి’ విషయంలోనూ అదే పని చేస్తున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమా ప్రచారం కోసం ఓ పాటను చిత్రీకరించే పనిలో ఉందట. దాంతో షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేస్తారట.

ప్రమోషనల్ సాంగ్ కోసం ఓ పాటను సిద్ధం చేశారు. దీని కోసం ఓ ప్రత్యేక సెట్‌ను కూడా రూపొందించారట. సినిమా పోస్టర్లను పరిశీలిస్తే ఈ సినిమా పడవ పోటీల నేపథ్యంలో సాగుతుంది అనిపిస్తోంది. ఇప్పుడు రూపొందిస్తున్న సెట్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుందట. ఈ పాటను కొరియోగ్రాఫర్ అజార్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారట. ఈ పాటలో సినిమా హీరో సూరి, సుహాస్ కనిపిస్తారట. ఈ సినిమాలో సుహాస్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తాడని ఓ టాక్. ఇప్పుడు రూపొందించనున్న పాట సినిమాలో ఉండదట.














