Prabhas: ప్రభాస్ కోసం షూస్, శాండిల్స్ డిజైన్ చేసింది ఎవరంటే..

అభిమానుల డార్లింగ్, రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పెదనాన్న కృష్ణంరాజు మరణం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రెండు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ చేయగా రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టింది. తన క్లోజ్ ఫ్రెండ్ ‘మ్యాచో స్టార్’ గోపిచంద్ కూడా జతకలిసి సందడి చేశారు. బాలయ్య, ప్రభాస్ షర్ట్ సైజ్ గురించి అడగడం, డార్లింగ్ తన షూ సైజ్ గురించి చెప్పగా..

అంతుంటే వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని అంటూ బాలయ్య సరదాగా అనడం చూశాం.. ప్రభాస్ షూ సైజ్ 13 అంగుళాలట.. మరి మన బ్యాచ్‌లర్ ‘బాహుబలి’ కష్టాలు తెలిశాయేమో కానీ ఇప్పుడు ఓ కంపెనీ తన సైజుకి తగ్గ షూస్, శాండిల్స్ తయారు చేసింది. సదరు బ్రాండ్ భారీ పాదాలతో తమ సైజుకి తగ్గ బూట్లు, చెప్పులు దొరక్క ఇబ్బంది పడుతున్న వారి కోసం 13 ఇంచెస్ షూస్ మరియు శాండిల్స్ తయారు చేసి అందుబాటులోకి తెచ్చినట్టు నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి..

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ రెండు భాగాలుగా రానుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెెక్ట్ – K’, మారుతి డైరెక్షన్లో ‘రాజా డీలక్స్’, దిల్ రాజు, ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్,

బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో మరో సినిమా లైన్‌లో పెట్టాడు ప్రభాస్. ఈ ఏడాది ‘ఆదిపురుష్’, ‘సలార్’ ఫస్ట్ పార్ట్.. రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు ప్రభాస్. తెలుగు ఇండస్ట్రీ నుండి హిందీ నాట అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ హాలీవుడ్ స్థాయిలో మన సినిమా సత్తా చాటుతాడు అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus