పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో యష్ భార్య?

  • June 13, 2019 / 05:06 PM IST

‘కెజిఎఫ్’ చిత్రంతో టాలీవుడ్లో కూడా స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఒక్క తెలుగులో మాత్రమే కాదు ఇండియా వైడ్ కూడా పాపులర్ అయ్యాడు. ఓ కన్నడ చిత్రం కూడా వంద కోట్లు వసూళ్ళను రాబట్టగలదని ప్రూవ్ చేశాడు ఈ హీరో. ప్రస్తుతం ‘కెజిఎఫ్’ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ హీరోకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా బాగా వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యష్ కి సంబంధించిన ఓ వార్త కన్నడ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

త్వరలో యష్ భార్య రాధిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇటీవల జరిగిన పార్మేంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన సుమలత యష్ మద్దతు పలుకుతూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని మాండ్య నియోజకవర్గంలో ఆమె గెలుపుకి కారణమయ్యాడు యష్. ఈ ప్రచార ప్రచార కార్యక్రమాల్లో యష్ స్పీచ్ లు విన్నవారందరూ… ఇతను రాజకీయాల్లోకి వస్తే రాణించగలడని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు యష్ తన భార్యని రంగంలోకి దింపుతున్నాడన్న టాక్ నడుస్తుంది. హాసన్ లోక్ సభ నియోజకవర్గం నుండీ ఆమెని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ వార్త ఇలా బయటకి వచ్చినప్పటినుండీ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. కానీ యష్ సన్నిహితులు మాత్రం ఇవి కేవలం రూమర్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇటీవల కూతురికి జన్మనిచ్చిన రాధికకు … రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus