స్పైడర్ మళ్ళీ వాయిదా!

  • May 12, 2017 / 06:18 AM IST

అసలు ప్రిన్స్ కు టైమ్ బాలేదు. అసలే ఒక పక్క బ్రహ్మోత్సవం సినిమా భారీ డిజస్టెర్ అయ్యిందని, ఎలా అయిన ప్రిన్స్ నెక్స్ట్ మూవీ సూపర్ హిట్ అవ్వాలన్న ఆశతో, ఎంతో ఆతురతతో ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటే, మరో పక్క తాజాగా ప్రిన్స్ నటిస్తున్న స్పైడర్ చిత్రం మాత్రం ప్రిన్స్ ను, ప్రిన్స్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ప్రిన్స్ లాస్ట్ మూవీ భారీ ఫ్లాప్ కావడం, అదే క్రమంలో ప్రిన్స్ యాంటీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం అన్నీ కలసి ఎలా అయినా స్పైడర్ సినిమా హిట్ అయితే వల్ల ఫ్రస్ట్రేషన్ కాస్త తగ్గుతుంది అని ప్లాన్ చేసుకున్నారు మన ప్రిన్స్ ఫ్యాన్స్. అయితే అదే క్రమంలో ఈ సినిమా తొలుత జూన్ లో వస్తుంది అని అందరూ ఆశించారు. అయితే వెంటనే జూన్ 23 నుంచి ఆగస్ట్ కి వాయిదా పడింది అని తెలిసి పాపం ఫ్యాన్స్ చాలా డీలా పడిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే, ఈ చిత్రం దసరా కి కూడా డౌట్ అనే వార్తలు వినపడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఏమో కానీ, దర్శకుడు మురుగుదాస్ ఈ చిత్రం విషయంలో చాలా కేర్ లేకుండా షూటింగ్ ప్లాన్ చేసాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే అదే క్రమంలో జూన్ నెలాఖరు కి షూటింగ్ పూర్తి చేస్తే గానీ విజువల్ ఎఫెక్ట్ ల కోసం ఆగస్ట్ కి అందుకోలేదు సినిమా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం అయ్యేలా కనపడ్డం లేదు. ప్రస్తుత ప్రోగ్రెస్‌ చూస్తే ఇది దాదాపు అసాధ్యమనేది క్లియర్ గా కనిపిస్తుంది. అసలైతే అన్నీ అనుకున్నట్లే జరిగితే, కనీసం ఆగస్టు నెలాఖరుకి రాని పక్షంలో దసరా బరిలోకి అయినా స్పైడర్‌ దిగాలి. కానీ దసరా అనేది ఇప్పుడు స్పైడర్ సినిమాకు చాలా ఇబ్బందుకు తెచ్చేపేట్టేలా కనిపిస్తుంది. ఇప్పటికే దసరాకి పలు పెద్ద సినిమాలు క్యూ కడుతోన్న నేపథ్యంలో తమిళ, హిందీ భాషల్లోను పోటీ లేని విడుదల కోరుకుంటోన్న స్పైడర్‌ అప్పుడు రావడం కూడా అనుమానమే అనుకోవచ్చు. ఈ సినిమా ఏ పోటీ లేకుండా బరిలో ఉంటేనే వసూళ్ల విషయంలో సేఫ్ అవుతారు బయ్యర్స్. అలా కాదని ఏమాత్రం తేడా వచ్చినా, రిసల్ట్ వేరేలాగా ఉన్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అదీ మొత్తంగా స్పైడర్ కధ.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus