రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన మహేష్ స్పైడర్ మూవీ షూటింగ్

  • May 6, 2017 / 01:47 PM IST

తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పైడర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నాలుగురోజుల క్రితం  హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలోని పోలీస్ క్వార్ట్రర్స్ లో ఆఖరి షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. అక్కడ కొంత యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించిన చిత్ర బృందం ఈ రోజు రామోజీఫిల్మ్ సిటీకి వెళ్లింది. మరో నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ చేయనున్నారు. దీంతో క్లైమాక్స్ ఫైట్ పూర్తి కానున్నట్లు సమాచారం.

ఇక జూన్ నుంచి మిగిలిన రెండు పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. మహేష్ పక్కన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఆడి పాడనున్న ఈ చిత్రంలో విలన్ గా డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య నటిస్తున్నారు.  ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీని మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్టు 9 న రిలీజ్ చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus