స్పైడర్ అన్ని కీలక డేట్స్ ఖరారు

  • May 10, 2017 / 09:19 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న స్పైడర్  షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి టీజర్ లండన్లో రెడీ అవుతోంది. ఈ టీజర్ ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31 న రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం డిసైడ్ అయింది.  ఇక హరీష్ జయరాజ్ స్వరపరిచిన పాటలను జూన్ 9 న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని మహేష్ బర్త్ డే అయిన ఆగస్టు 9 న రిలీజ్ చేయాలనీ నిర్మాతలు మొదట అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల స్పైడర్ ఆగస్టు 11 న థియేటర్లో సందడి చేయనున్నాడు.

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా, తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పీ, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ వందకోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus