ఎన్టీఆర్ చిన్న కూతురు మృతి..!

  • August 1, 2022 / 03:44 PM IST

దివంగత స్టార్ హీరో, ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి చరిత్ర గురించి.. ఆయన కుటుంబం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఎంతో మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి వారు స్టార్లు అవ్వగా కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో రాణిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు దాదాపు అందరికీ సుపరిచితమే. అయితే కూతుర్లలో ఒకరిద్దరి గురించి మాత్రమే జనాలకు తెలిసుండొచ్చు.

సీనియర్ ఎన్టీఆర్ కి నలుగురు కూతుర్లు ఉన్నారు.వారే లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి. వీరిలో తాజాగా కంటమనేని ఉమా మహేశ్వరి మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. జూబ్లీ హిల్స్ లోని ఆమె నివాసంలో ఉమా మహేశ్వరి మరణించింది. ఉమా మహేశ్వరి మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయినట్టు అయ్యింది. ఈ మధ్యనే ఉమా మహేశ్వరి కూతురి వివాహం జరిగింది. ఆల్రెడీ చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ కూతుర్లలో ఉమా మహేశ్వరి మీడియాకి చాలా దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె జీవితం చాలా విషాదంతో నిండింది అనే చెప్పాలి.ఈమెకి రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త నరేంద్ర రాజన్ ఓ శాడిస్ట్. ఈమెను సిగరేట్లతో కాల్చడం వంటివి చేసేవాడు. ఈ విషయం చివరికి రామారావుగారి తెలియడంతో విడాకులు ఇప్పించి కంటమనేని ఇంటికి కోడలిగా చేశారట.అయితే ఉమా మహేశ్వరి హఠాన్మరణం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus