Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఇఫీలో ఇండియన్ పనోరమాకు ఎంపికైన ‘స్రవంతి’ రవికిశోర్ తొలి తమిళ సినిమా ‘కిడ’

ఇఫీలో ఇండియన్ పనోరమాకు ఎంపికైన ‘స్రవంతి’ రవికిశోర్ తొలి తమిళ సినిమా ‘కిడ’

  • October 22, 2022 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇఫీలో ఇండియన్ పనోరమాకు ఎంపికైన  ‘స్రవంతి’ రవికిశోర్ తొలి తమిళ సినిమా ‘కిడ’

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఈ రోజు వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో సుప్రసిద్ధ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా ‘కిడ’ ఒకటి.

‘కిడ’లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”ఆర్ఏ వెంకట్ ఈ ‘కిడ’ కథను చెప్పినప్పుడు ఇందులో విషయం ఉందని అర్థమైంది. అందరికీ కనెక్ట్ అవుతుందని వెంటనే ఓకే చేశా. ఇది పేరుకు తమిళ చిత్రమే. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా యూనివర్సల్ అయ్యింది. భాషలకు అతీతంగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏ భాషలో సినిమా తీసినా సరే అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ అవుతుందనే ఉద్దేశంతో తమిళంలో తీశాం. మూడున్నర దశాబ్దాల మా స్రవంతి మూవీస్ ప్రయాణంలో తొలి తమిళ చిత్రమిది. తమిళనాడులోని మధురై జిల్లాలో కంబూర్ అనే కుగ్రామంలో ‘కిడ’ చిత్రీకరణ చేశాం. దీపావళి అనేది అందరికీ పెద్ద పండగ. ముఖ్యంగా తమిళ ప్రజలకు, అక్కడి చిన్నారులకు దీపావళి ఇంకా పెద్ద పండగ. పండక్కి కొత్త దుస్తులు కొనుక్కోవడం ఆనవాయితీ. పల్లెల్లో ఎవరైనా సరే తమ తాహతుకు మించి పిల్లలకు కొత్త దుస్తులు కొనివ్వాలని తాపత్రయపడుతుంటారు. కొనిచ్చిన తర్వాత తామే దుస్తులు ధరించినట్టు ఆనందపడతారు. ఆ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. మనవడి కోసం ఓ తాతయ్య తనకు తానే ఓ ఛాలెంజ్ విసురుకుంటాడు. ఆ ఛాలెంజ్ ఏమిటన్నది సినిమాలో చూడాలి. అది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసులను తాకే భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి. ఎమోషనల్ చిత్రమిది.  ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – 2022లో ప్రదర్శనకు ఇండియన్ పనోరమా మా సినిమాను ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. తమిళం నుంచి ‘జై భీమ్’తో పాటు ‘కిడ’ను ఎంపిక చేయడం మరింత ఆనందకరంగా ఉంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అన్ని భాషల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.

నవంబర్ 20 నుంచి 28 వరకు 53వ గోవాలో ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ను నిర్వహించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kida
  • #sravanthi ravi kishore

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

13 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

19 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

22 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

18 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

19 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

2 days ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

2 days ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version