బుల్లితెర పై స్టార్ యాంకర్.. అలాగే సోషల్ మీడియాలో హాట్ యాంకర్ అనగానే మనకి టక్కున గుర్తొచ్చే పేరు శ్రీముఖి. ‘పటాస్’ షో మొదలుకుని చాలా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కూడా యాంకరింగ్ చేస్తూ వస్తుంది. అంతేకాదు ‘జులాయి’ ‘నేను శైలజ’ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు చేసి.. కొన్ని చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలాగే అభిమానులు తన ఫోటోలు పెట్టినప్పుడల్లా లైకులు, రీట్వీట్ లు చేస్తుంటుంది ఈ బ్యూటీ.
ఇప్పుడు మళ్ళీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వీటికి ‘కోజీ ఈవినింగ్స్’ అనే క్యాషన్ కూడా ఇచ్చింది. మెరూన్ కలర్ స్వెటర్ ధరించి.. ఫ్లోర్ పై కూర్చొని కాళ్ళ అందాలను ప్రదర్శిస్తూ సెన్సిటివ్ పోజులిస్తుంది శ్రీముఖి. స్వెటర్ వేసుకొని కూర్చుంది కదా ఆమెకు వెచ్చగానే ఉంటుంది. చల్లదనం కోసం ఆమె ఇలా తైస్ వరకూ ఏమీ లేకుండా కూర్చుంది సరే… కానీ నెటిజెన్లకి మాత్రం ఈ ఫోటోలు తెగ హీటెక్కిస్తున్నాయి. ఇక శ్రీముఖి సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ కి కూడా వారు ఫిదా అయిపోతున్నారు. ఇక త్వరలోనే ‘బిగ్ బాస్3’ లో శ్రీముఖి కనిపించనుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఆ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.