Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మెగాస్టార్‌ కాంప్లిమెంట్‌తో ఆస్కార్‌ వచ్చినంత సంబరపడ్డా!: శ్రీధర్‌ సీపాన

మెగాస్టార్‌ కాంప్లిమెంట్‌తో ఆస్కార్‌ వచ్చినంత సంబరపడ్డా!: శ్రీధర్‌ సీపాన

  • July 29, 2020 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్‌ కాంప్లిమెంట్‌తో ఆస్కార్‌ వచ్చినంత సంబరపడ్డా!: శ్రీధర్‌ సీపాన

‘లౌక్యం’ తెలిసిన రచయిత శ్రీధర్‌ సీపాన. ఏకకాలంలో ఐదారు చిత్రాలకు పని చేయగల సమర్ధుడు. ఆయన మాటల ‘పూలరంగడు’. వినోదంతో పాటు విలువైన విషయాలను చక్కగా చెప్పగలడు. కమర్షియల్‌ కథలకు కత్తిలాంటి మాటలు రాసి, కామెడీతో ప్రేక్షకులను మెప్పించగల రైటర్‌.. ‘లౌక్యం’, ‘పూలరంగడు’, ‘ఆహనా పెళ్ళంట’ తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన రచయితగా పని చేశారు. జూలై 29న శ్రీధర్‌ సీపాన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ…

హలో శ్రీధర్‌ సీపాన గారు… హ్యాపీ బర్త్‌డే!

థ్యాంకూ సో మచ్‌!

బర్త్‌డేను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారు?

స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ ఏమీ లేవు. ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకున్నా. ప్రజెంట్‌ కరోనా వల్ల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళడం లేదు. ఇల్లు, ఆఫీసు, పని అంతే!

రైటర్‌గా ఈ ఇయర్‌ ఎలా ఉంది?

నేను అయితే ఎప్పటికీ మరువలేను. మెగాస్టార్‌ చిరంజీవిగారు, చక్కటి సందేశాత్మక కథలకు కమర్షియల్‌ విలువలు మేళవించి సినిమాలు రూపొందించే దర్శకుడు కొరటాలశివగారి కాంబినేషన్‌లో ఫస్ట్‌టైమ్‌ వస్తున్న ‘ఆచార్య’ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నా. వాళ్ళిద్దరితో మంచి రిలేషన్‌ ఏర్పడింది. అలాగే, దర్శకుడిగా నా మొదటి సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశా. చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా జీఏ2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌గారు, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌గారు నిర్మిస్తారు.

దర్శకులుగా మారుతున్న రచయితల జాబితాలో మీరు చేరుతున్నారన్నమాట!

తన ఊహలకు అనుగుణంగా తన కథను తెరపై ఆవిష్కరించుకున్నప్పుడు రచయితలకు కిక్‌ వస్తుంది. సంతృప్తి దొరుకుతుంది. ఆ కిక్‌ కోసమే రచయితలందరూ దర్శకులు అవుతారు. నేనూ అలాగే ఆలోచించి మెగాఫోన్‌ పట్టాను.

దర్శకుడు అవుతున్నారు. రచన పరంగా ఇతర దర్శకుల సినిమాలకు దూరంగా ఉంటారా?

అటువంటిది ఏమీ లేదు. రచన, దర్శకత్వం… రెండూ నాకు రెండు కళ్ళు వంటివి. ఓ కన్ను కోసం మరో కన్నును వదులుకోలేను. రచయితగా ఒక్కోసారి ఐదారు చిత్రాలకు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, దర్శకత్వంతో పాటు అవకాశాలు వస్తే రచయితగా కూడా కొనసాగుతా. రైటింగ్‌కి దూరం కాను. కేవలం నా సినిమాలు మాత్రమే కాకుండా…. ఇతరుల సినిమాలకు కూడా రాస్తా. దర్శకుడినైనా రచయితగా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.

కల్యాణ్‌దేవ్‌తో మీ సినిమా ఎలా ఉండబోతుంది?

కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అది. ప్రేక్షకులను పూర్తిగా నవ్విస్తుంది. అలాగే, మధ్య మధ్యలో మంచి ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉంటాయి.

చిరంజీవిగారికి ఆ సినిమా కథ చెప్పారా?

‘ఆచార్య’ స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నానని చెప్పాను కదా! అలా చిరంజీవిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గరకు కథ చెప్పడానికి కల్యాణ్‌దేవ్‌గారు నన్ను తీసుకువెళ్ళారు. కథంతా విన్నాక ‘సుదీర్ఘంగా కథ వింటున్నప్పుడు మధ్యలో రెప్పలు పడతాయి. నువ్వు కథ చెబుతుంటే రెప్ప వేయకుండా విన్నాను. ఆద్యంతం నవ్వుతూ విన్నాను’ అని చిరంజీవిగారు చెప్పారు. ఆ మాట ఆస్కార్‌ అవార్డు వచ్చినంత సంతృప్తినిచ్చింది. అలాగే, రాఘవేంద్రరావుగారు, కొరటాల శివగారు విని బావుందని మెచ్చుకున్నారు. ప్రోత్సహించారు.

రచయితగా, దర్శకుడిగా మీ లక్ష్యం ఏంటి?

ప్రతి సినిమాతో ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించడమే నా లక్ష్యం. హెల్డీ కామెడీ అందిస్తా.

మీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌?

కల్యాణ్‌దేవ్‌ సినిమా చేస్తున్నా. అలాగే, రాఘవేంద్రరావుగారు దర్శకత్వం వహించనున్న ఓ సినిమాకి సంభాషణలు రాస్తున్నా. అనిల్‌ సుంకర నిర్మాణంలో మరో సినిమా చేయాలి. శ్రీనివాస్‌ వంగాల నిర్మాణంలో నేను దర్శకత్వం వహించిన ‘బృందావనమది అందరిదీ’ షూటింగ్‌ కంప్లీట్‌ చేశా. కల్యాణ్‌దేవ్‌ సినిమా తర్వాత ఓటీటీలో ఆ సినిమా రిలీజవుతుంది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Sreedhar
  • #Sreedhar Seepana
  • #Writer Sreedhar Seepana

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

21 seconds ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

2 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version