నా 14 ఏళ్ల వయసులో పరిచయమయ్యావ్… నా జీవితంలో వెలుగులు నింపావు: శ్రీజ

శ్రీజ కొణిదెల పరిచయం అవసరం లేని పేరు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తెగా అందరికీ సుపరిచితమైనప్పటికీ ఈమె తన వ్యక్తిగత విషయాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ ఎంతో పాపులర్ అయ్యారు. శ్రీజ చిన్న వయసులోనే ఇంట్లో వారిని ఎదిరించి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె అనంతరం అతనితో మనస్పర్ధలు వల్ల తనకు విడాకులు ఇచ్చారు. ఇలా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్న శ్రీజ తనతో మనస్పర్ధలు వచ్చాయని,

ప్రస్తుతం తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇచ్చి తనకు దూరంగా ఉంటున్నారని వార్తలు రావడంతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీజ ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే గతంలో ఈ ఏడాదిలో కొత్త వ్యక్తిని పరిచయం చేసావు తనతో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నాను అంటూ ఈమె చేసిన పోస్ట్ ఎలాంటి పరిణామాలకు దారితీసిందో మనకు తెలిసిందే.

అయితే ఈమె సెల్ఫ్ రిలేషన్లో ఉన్నానంటూ సెల్ఫ్ లవ్ కన్నా మించినది ఏదీ లేదంటూ మరొక పోస్టుతో అందరికీ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక పోస్ట్ ద్వారా శ్రీజ వార్తల్లో నిలిచారు. ఈ సందర్భంగా తనకు కాఫీ అంటే ఎంత పిచ్చి ప్రేమ ఉందో ఈ పోస్ట్ ద్వారా తెలియజేశారు. నా అల్లరికి ప్రశాంతతను నువ్వే ఇస్తావు.. జీవితంలో చీకటికి నువ్వే వెలుగులు నింపుతావు… నేను ఉదయమే నిద్రలేస్తున్నానంటే అందుకు కారణం నువ్వే.

నా 14 ఏళ్ల వయసులో నువ్వు (కాఫీ) నాకు పరిచయమయ్యావు. అప్పటినుంచి నాతోనే ఉంటున్నావ్ థాంక్యూ మై డియర్ కాఫీ అంటూ ఈమెకు కాఫీ పై ఉన్న ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus