ఈ మధ్యకాలంలోనే కాదు.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ నిర్మాతలు ఓ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నారు. అదేంటంటే.. ఓ పక్క పెద్ద సినిమా నిర్మిస్తుండడం మరోపక్క.. చిన్న సినిమా నిర్మిస్తుండడం. ఆ చిన్న సినిమా ప్రమోషన్లకి వారి నిర్మాణంలో చేస్తున్న పెద్ద హీరోని వాడెయ్యడం అన్న మాట. అలా ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉండడం అని తెలుస్తుంది. ఉదాహరణకి ఆ పెద్ద హీరోని.. వారి చిన్న సినిమా ప్రమోషన్లకు తీసుకురావడం లేదా.. ఆ పెద్ద హీరోతో వారి చిన్న సినిమా ట్రైలర్ ను విడుదల చేయించడం వంటివి అన్న మాట.
తాజాగా ‘శ్రీకారం’ నిర్మాతలు మరోసారి ఈ ఫార్ములాని అప్లై చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. అదేంటంటే.. ‘శ్రీకారం’ నిర్మాతలు అయిన ’14 రీల్స్ ప్లస్’ వారు మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో ‘శ్రీకారం’ సినిమా పై ట్వీట్ వేయిస్తే… అతని ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు వారిని థియేటర్లకు రప్పించవచ్చు అని స్కెచ్ వేసారట. ఈ క్రమంలో మహేష్ బాబుకి ‘శ్రీకారం’ సినిమా చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తుంది.
తొలిరోజు ‘శ్రీకారం’ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కాబట్టి.. ఈ టైంలో మహేష్ వంటి స్టార్ హీరో కనుక సినిమా బాగుందని ఓ ట్వీట్ వేస్తే.. లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ ను సాధించొచ్చు. ఆల్రెడీ మహేష్ తో ‘శ్రీకారం’ ట్రైలర్ ను విడుదల చేయించారు ’14 రీల్స్ వారు’. అయితే ఇప్పుడు ‘జాతి రత్నాలు’ సినిమా నుండీ కూడా గట్టి పోటీ ఎక్కువవడంతో వారు ఈ స్టెప్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!