రామ్ – బోయపాటి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘స్కంద’. ఈ సినిమా సంబంధించి ఇటీవల పిడుగు కార్యక్రమం జరిగింది. అదేనండీ ‘ప్రీ రిలీజ్ థండర్’. మామూలుగా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు కానీ.. వెరైటీగా ఉంటుందని ఈ సినిమా థండర్ అని పేరు పెట్టారు. ఆ విషయం పక్కనపెడితే.. ఈ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ చేసిన సందడి హైలైట్‌గా నిలిచింది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడి పక్కా అనుకోండి. ఆ తర్వాత హైలైట్ అంటే మాత్రం శ్రీలీల క్యూట్‌నెస్ అని చెప్పాలి.
హీరో రామ్ స్పీచ్‌తో అదరగొట్టగా… శ్రీలీల లుక్స్, ముద్దు ముద్దు మాటలతో మైమరిపించింది. ఈవెంట్లో ఆమె డ్యాన్స్, సింగింగ్, మాటలు, రియాక్షన్స్ ఇలా చాలా హైలైట్‌గా నిలిచాయి. స్టేజీపై చాలా యాక్టివ్ డ్యాన్స్ వేసి ఓవైపు వావ్ అనిపించగా… మరోవైపు తమన్‌తో కలసి గొంతుకలిపి ఓ పాట పాడింది. ఇక బాలయ్య దగ్గర చిన్న పిల్లలా మారిపోయి అల్లరి చేసింది. రామ్‌తో అయితే యాక్టివ్‌గా కనిపించింది. ఇదంతా చూసి ‘ఇదేం క్యూట్‌నెస్ రా బాబూ.. ఇంత క్యూట్‌గా ఉంది’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.
శ్రీలీల అంటే సినీ ప్రియులకు ఠక్కున గుర్తొచ్చేది ఆమె డ్యాన్స్. హీరో ఎవరైనా, పాట ఏదైనా ఆమె స్టెప్పులు, గ్రేస్ ఆమె లెక్కే వేరు. అయితే తాజాగా ‘స్కంద’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల పాట పాడింది. సంగీత దర్శకుడు తమన్ టీమ్‌తో కలసి ‘స్కంద’ సినిమాలోని ‘నీ చుట్టు చుట్టు…’ పాటను ఆలపించింది. శ్రీలీలలోని ఈ హిడెన్ టాలెంట్‌ను చూసి అభిమానులతోపాటు హీరో రామ్, ముఖ్య అతిథి బాలకృష్ణ కూడా ఎంజాయ్ చేశారు.
ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అదే వేదిక మీద ఆమెను లవ్ ప్రపోజల్స్ గురించి అడిగితే… ‘‘చూడొచ్చేమో.. ఉంటుందేమో’’ అంటూ క్యూట్‌గా మాట్లాడింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అందులో ఇంకెంత క్యూట్‌గా ఉంటుందో శ్రీలీల.