‘ఆహా’ లో శ్రీలీల కొత్త మూవీ

  • April 8, 2023 / 11:01 AM IST

ప్రస్తుతం శ్రీలీలకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె లక్కీ హ్యాండ్‌గా మారిపోయారు. ఆమె నటించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవుతున్నాయి. విరాట్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా భవానీ మీడియా సంస్థ ద్వారా ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

అవిరుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై శ్రీమతి బత్తుల వసంత సమర్పణలో ఎపి అర్జున్‌ దర్శకత్వంలో సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల, ఎపి అర్జున్‌ నిర్మాతలుగా ఈ సినిమా వచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అవ్వడం, శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాకు ప్రధాన ఆకర్షణలు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విరాట్ యాక్షన్, శ్రీలల లుక్స్ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల ఆద్యంతం తన అందచందాలు, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు పూర్ణాచారి పాటలు, హరికృష్ణ సంగీతం, అర్జున్ శెట్టి కెమెరా పనితనం అందించడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus