Sreeleela: ప్రమోషన్స్ ద్వారా శ్రీలీల ఈ రేంజ్ లో సంపాదిస్తున్నారా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీలీల పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే శ్రీలీల చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. భగవంత్ కేసరి సినిమాతో శ్రీలీల ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. భగవంత్ కేసరి మూవీ నుంచి తాజాగా ఉయ్యాలో ఉయ్యాలా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కాగా ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. భగవంత్ కేసరి త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా త్వరలో ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ రానుంది. భగవంత్ కేసరి హిందీలో కూడా రిలీజ్ కానుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాల్సి ఉంది. బాలయ్య సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. మరోవైపు శ్రీలీల ఒక ఈవెంట్ ప్రచారానికి గంటకు 12 లక్షల రూపాయల పారితోషికం డిమాండ్ చేశారని తెలుస్తోంది.

శ్రీలీల గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గుంటూరు కారం సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. గుంటూరు కారం సినిమా కథకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు. గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజైతే మాత్రమే ఈ సినిమా కథ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

గుంటూరు కారం సినిమాతో (Sreeleela) శ్రీలీల ఇమేజ్, రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులతో 250 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది. గుంటూరు కారం సినిమా సంక్రాంతి విజేతగా నిలిచి సులువుగా 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సులువుగా సాధించే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ తర్వాత సినిమాలు భారీ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus