బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి ఏం చేసినా హాట్ టాపిక్ అవుతుంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘పటాస్’ షోతో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ యాంకర్.. అంతకు ముందు పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే బుల్లితెర పైనే ఈమె ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది అని చెప్పొచ్చు.తన నాన్ స్టాప్ పంచ్ లతో ఎవ్వరికైనా చమటలు పట్టించగల కెపాసిటీ ఉన్న యాంకర్ శ్రీముఖి. ‘బిగ్ బాస్3’ రియాలిటీ షోలో పాల్గొని రన్నర్ గా నిలిచిన శ్రీముఖి ఆ షోతో తన ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకుంది.
సోషల్ మీడియాలో కూడా ఈమె యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లలో షేర్ చేస్తూ ఉండే శ్రీముఖి.. మొన్నామధ్య యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించి మరింతగా అభిమానులతో టచ్ లో ఉంటూ వస్తోంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. మేటర్ ఏంటంటే.. తన ఊరి నుండీ వాళ్ళ అమ్మగారు మరియు ఫ్యామిలీ మెంబెర్స్ రావడంతో.. వీకెండ్ ట్రిప్ ను ప్లాన్ చేసింది శ్రీముఖి.
తన ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ ను కూడా వెంటబెట్టుకుని కొంపల్లిలోని ఓ ఫామ్ హౌస్ మరియు రిసార్ట్ కు వెళ్ళింది. అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలు ఆడుతూ బాగా ఎంజాయ్ చేసింది ఈ బ్యూటీ. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి :