Siri, Shanmukh: షణ్ముఖ్ కు ముద్దు పెట్టిన సిరి.. ఆమె బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..!

  • October 29, 2021 / 06:49 PM IST

‘బిగ్ బాస్’ లో హగ్గులు ముద్దులు అనేవి సర్వసాధారణం.అయితే ఈ 5వ సీజన్లో ఆల్రెడీ చాలా మంది అందమైన అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. ప్రియా కూడా కుర్రకారుకి కనెక్ట్ అయిన కంటెస్టెంటే..! ఆమె కూడా ఎలిమినేట్ అవ్వడంతో స్పైస్ ఎలా యాడ్ చేయాలో బిగ్ బాస్ కు అంతుచిక్కడం లేదనుకుంట.ఎనిమిదో వారంలో సిరి, షణ్ముఖ్ ల పై కాన్సన్ట్రేట్ చేసినట్టు ఉన్నాడు. తాజా ఎపిసోడ్ లో సిరి.. షణ్ముఖ్ కు ముద్దు పెట్టిందే దీనినే హైలెట్ చేస్తూ వచ్చాడు ‘బిగ్ బాస్’.

ఇది ఆమె బాయ్ ఫ్రెండ్ రియాక్ట్ అయ్యేంత వరకు వెళ్ళింది. షణ్ముఖ్ కూడా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన దీప్తి సునైనా తో రిలేషన్లో ఉన్నవాడే. ఆమె ఇంకా దీని పై రియాక్ట్ కాలేదు. లేకపోతే ఆమె కూడా ‘బిగ్ బాస్2’ లో తనీష్, సామ్రాట్ లతో ఇలాగే చనువుగా ఉన్న సందర్భాలను గుర్తుచేసుకుని కామ్ గా ఉందో..! ఇక మేటర్ ఏంటంటే.. ” ‘మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాము’ అంటూ షణ్ముఖ్.. తోటి కంటెస్టెంట్ అయిన సిరికి చెబుతుండగా..

నీ వల్లే మెంటల్‌గా ఇబ్బంది పడుతున్నా అంటూ సిరి సమాధానం ఇచ్చింది. దీనికి షణ్ముఖ్ రియాక్ట్ అవుతూ… ‘చిరాగ్గా అనిపిస్తే దూరం పెట్టు అంటూ ఓ ఎమోషనల్ డైలాగ్ చెప్పాడు. దానికి వెంటనే సిరి వచ్చి అతని నుదిటి పై ముద్దు పెట్టింది.’ ఈ ప్రోమోకి గాను సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తుండగా..! అందుకు శ్రీహాన్.. ‘ ఇప్పుడేంట్రా నేను ఏడవాలా’ అంటూ తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టాడు. అంటే ఓ విధంగా సిరికి అతను మద్దతు పలికినట్టే..!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus