పేరుకే క్లాస్ డైరెక్టర్ కానీ.. చేతల విషయంలో మాత్రం ఊర మాస్

నిన్నమొన్నటివరకూ ఎవరి పేర్లు బయటపెట్టకుండా కేవలం అతనలాంటి వాడు, ఇతను ఇలా వాడాడు అంటూ కబుర్లు చెప్పిన యూట్యూబ్ సెన్సేషన్ శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో పేరు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మెన్షన్ చేస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఫిదా సక్సెస్ ఇచ్చిన బూస్ట్ తో కొత్త కథ రాసుకొంటున్న డైరెక్టర్ శేఖర్ కమ్ములపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై ఆమె చేసిన తీవ్ర ఆరోపణలను చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇమేజ్ ఇలానే వుందా అనే ఆశ్చర్యం కలుగకమానదు.

ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన ఆరోపణలు ఇలా వున్నాయి… ‘పెద్ద డైరెక్టర్ అని పొగరు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్‌లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్‌గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖర్” అంటూ శ్రీరెడ్డి శేఖర్ కమ్ములపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దిమ్మతిరిగేలా వున్నాయి. మరి దీనిపై శేఖర్ కమ్ముల ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus