వెంకీ మామను కూడా కెలుకుతున్న శ్రీరెడ్డి
- January 30, 2019 / 06:25 AM ISTByFilmy Focus
“చినమామ.. కంగ్రాచ్యులేషన్స్” అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో విక్టరీ వెంకటేష్ ని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోలను కెలికేసిన శ్రీరెడ్డి ఇప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వెంకటేష్ ని కూడా విడిచిపెట్టలేదు. వెంకీ నటించిన “ఎఫ్ 2” సినిమా విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి విషెస్ చెబుతూ కాస్త వెటకారంగా పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. “చినమామ, అదే మా వెంకీ మామ సినిమా పెద్ద హిట్ అంటగా.. కంగ్రాచ్యులేషన్స్ మామ, నా 90 డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంటగా” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.
- మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీరెడ్డికి వెంకీ మామ ఎలా అవుతాడనే కదా మీ సందేహం.. గతంలో ఈమె సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ తో తనకు శారీరక సంబంధం ఉందని, వారిద్దరూ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలను లీక్ చేసింది. అభిరామ్ తో ఉన్న సంబంధం కారణంగా సురేష్ బాబుని మామ అని పిలుస్తానంటోంది. సురేష్ బాబుకి తమ్ముడైన వెంకీని ఇప్పుడు చినమామ అని వరుసలు పెట్టి పిలిచేస్తోంది. మరి ఇప్పుడు శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ పై వెంకీ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.













