సీనియర్ నటి శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతోంది. అలా జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ, తన అభిమానులతో పంచుకుంటోంది.
ఇటీవలే తన పెద్ద కూతురు జాహ్నవి కపూర్ తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోను శ్రీదేవి తన ట్విట్టర్ ఎకౌంటు లో ఉంచగా.. శ్రీదేవి కంటే జాహ్వాని ఎంతో అందంగా ఉందని నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలిపారు. కాగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్ లో జాహ్నవి నటించనుందని గతంలో వార్తలు రాగా.. ప్రస్తుతం జాహ్నవి ధ్యాస మొత్తం చదువు పైనేనని శ్రీదేవి స్పష్టం చేసింది.