చిన్నవయసులోనే శ్రీదేవి సూపర్‌స్టార్ హోదాని అందుకున్నారు. పదహారేళ్ళ వయసు ప్రాయంలో ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో తక్కువ సినిమాలతో స్టార్ హీరోయిన్ కిరీటాన్ని దక్కించుకున్నారు. కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళం, హిందీలో కొన్నేళ్లుగా టాప్ హీరోయిన్ గా కొనసాగింది. తనలాగా కూతుళ్లను తొందరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించలేదు. పెద్ద కుమార్తె జాన్వి చదువు పూర్తి చేసిన తర్వాత మొదటి సినిమాకి సంతకం చేయించింది. మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న “సైరాట్” కథలో నటింపచేయించేందుకు ఒకే చెప్పింది. అయితే అనుకోకుండా లోకాన్ని వదిలివెళ్లిపోయింది. తల్లి ఇచ్చిన ధైర్యంతో జాన్వి ఈ సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడింది. “దఢక్” పేరుతో హిందీ రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు ఫరా ఖాన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సినిమాలోని కొన్ని పాటలకు జాన్వితో స్టెప్పులేయించారు. ఈ సందర్భంగా జాన్వితో కలిసి పనిచేయడం తనకు ఎలా అనిపించిందో మీడియా ద్వారా వెల్లడించారు. “నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. నా కెరీర్ తొలినాళ్లలో నన్ను బాగా ప్రోత్సహించారు. జాన్వి మంచి డ్యాన్సర్. ఏదైనా త్వరగా నేర్చుకుంటుంది. ఆమెను తన తల్లితో పోల్చడం కరక్ట్ కాదు. జాన్వి వయసు నాటికి శ్రీదేవి సూపర్‌స్టార్ అయిపోయారు. కానీ ఇది జాన్వికి తొలి చిత్రం” అని చెప్పారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది.