సుధీర్ బాబు హీరోగా ఆనంది హీరోయిన్ గా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ’70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగష్ట్ 27న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, హీరో సుధీర్ బాబు ఇంట్రో టీజర్,హీరోయిన్ ఆనంది ఇంట్రో టీజర్,ట్రైలర్ పాటలకు మంచి స్పందన లభించింది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్న మూవీ ఇదే కావడం విశేషం.
ఇక ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
2.70 cr
సీడెడ్
1.60 cr
ఆంధ్రా(టోటల్)
2.90 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
7.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.78 cr
వరల్డ్ వైడ్ టోటల్
7.98 cr
‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రానికి రూ.8 కోట్ల బడ్జెట్ అయ్యింది. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఈ చిత్రానికి రూ.12.5 కోట్లు వచ్చాయి. అక్కడికి నిర్మాత రూ.4.5 కోట్లతో లాభపడ్డాడు. ఇక థియేట్రికల్ రైట్స్ రూ.7.98 కోట్లకు జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ చిత్రం రూ.8.2 కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట. సినిమా పై పాజిటివ్ బజ్ ఉంది. పైగా సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువ థియేటర్లలో విడుదలవుతుంది. హిట్ టాక్ వస్తే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు.