ఆసక్తికరంగా మారిన విజేత‌ గురించి శ్రీజ చెప్పిన సమాధానం!!

  • July 13, 2018 / 09:20 AM IST

మెగాస్టార్ చిన్న అల్లుడు, శ్రీజ భర్త  కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాకేష్ శ‌శి దర్శకత్వం వహించిన సినిమా నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది.  వారాహి చలన చిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మించిన విజేత సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. అందరూ ఈ చిత్రం బాగుందని ప్రశంసిస్తున్నారు. మరి కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజ సినిమా చూసి ఎలా ఫీలయింది? అనే ప్రశ్న అందరిలోనూ కలిగింది. ఇదే ప్రశ్నను క‌ళ్యాణ్‌దేవ్ ముందు ఉంచగా అతను ఇలా స్పందించారు. “అస‌లు శ్రీ‌జ‌కు సినిమాల‌పై పెద్ద‌గా ఆస‌క్తి లేదు. పెద్ద‌గా ప‌ట్టించుకోదు” అని చెప్పారు.

ఇంట్లో హీరోలు ఏ సినిమాల్లో నటిస్తున్నారనేది కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోద‌ని తెలిపారు. అయితే త‌న సినిమా చూసి త‌న‌ని ప్ర‌శంసించింద‌ని కళ్యాణ్ దేవ్ వివరించారు. శ్రీజకి సినిమాలపై ఇష్టం లేదని తెలుసుకొని ఫిలిం నగర్ వాసులు ఆశ్చర్యపోతున్నారు. నాన్న మెగాస్టార్.. అన్న మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీ హిట్ సాధిస్తున్నా శ్రీజకి సినిమాలపై ఆసక్తిలేకపోవడాన్ని అభిమానులు పాజిటివ్ గా తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాల గురించి విని విని ఆమెకు బోర్ కొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే ఆమె అక్క సుస్మిత సినిమాలో రంగంలో పనిచేస్తున్నప్పటికీ శ్రీజ మాత్రం ఈ వైపుకు రాలేదని అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus