‘కొత్తబంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్ కు మంచి చిత్రాలు ఇవ్వడం మొదలు పెట్టాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఫ్యామిలీ చిత్రాల్లో ‘గేమ్ చేంజర్’ చిత్రం అంటే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రమనే చెప్పాలి. ‘పెళ్ళిసందడి’ చిత్రం తర్వాత ప్రేక్షకులు ఆ స్థాయిలో ఎంజాయ్ చేస్తుంది ఈ మల్టీస్టారర్ చిత్రంతోనే.. అనడంలో అతిశయోక్తి లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు డీసెంట్ ఎంట్రీ అందించాడు. అలాంటి డైరెక్టర్ మహేష్ తో చేసిన ‘బ్రహ్మోత్సవం’ లాంటి డిజాస్టర్ తరువాత అడ్రెస్స్ లేకుండా పోయాడు.
అయితే ‘గీత అర్ట్డ్స్’ బ్యానర్లో నాని తో ఓ చిత్రం చేయబోతున్నడనే వార్త ప్రచారంలో ఉంది. శ్రీకాంత్ అడ్డాల మార్క్ కి తగ్గట్టుగా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని రాసుకున్నాడట. 2020 సంక్రాంతి లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడట శ్రీకాంత్. అయితే ఇప్పుడు నని 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీంతో శర్వానంద్ తో ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.