శ్రీకాంత్ తనయుడి కోసం “పెళ్లి సందడి” రీమేక్!
- April 19, 2016 / 01:00 PM ISTByFilmy Focus
అప్పుడే విలన్ నుంచి హీరోగా మారిన శ్రీకాంత్ కెరీర్ కు సూపర్ కిక్ ఇచ్చిన చిత్రం “పెళ్లి సందడి”. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రం ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు కథానాయకుడిగా శ్రీకాంత్ కు తెలుగు ఇండస్ట్రీలో బలమైన పునాది వేసింది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో పాటలు అప్పట్లో ఓ సంచలనం.
ఇప్పుడీ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ సదరు రీమేక్ లో నటించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎవరు నిర్మిస్తారు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే.. రోషన్ పరిచయ చిత్రం “నిర్మలా కాన్వెంట్” జూన్ లో విడుదల కానుంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












